నా నీకు
జీవిత పయనమ్లో
నేనెక్కిన నావకు
ఊహించిన విఘాతం తగిలి
ఆగిపోయిన క్షణం
నేనున్నానంటూ
సరి కొత్త సరంగులా
నీ లాలిత్యపు ప్రేమ పడవలో ఎక్కాక
ఆర్తిగా నీ వందించిన
అమృత హస్తమందుకున్నాక
సున్నితత్వపు నిర్వచనం తెలిసింది
మంచితనం మర్మం అర్థమయింది
సహనం స్థాయి సుస్పష్టమయింది
లక్ష్యం వైపే లక్షణంగా
వెళ్ళే నీతో వస్తే
గమ్యం తప్పక చేరగలననే
నమ్మికతో
ఇప్పుడు నన్ను సంపూర్ణంగా
నీలోకి కుదిన్చుకున్నాను
ఇక రేపటి వెలుగు
నాకు చూపాల్సింది నువ్వే
నా కెప్పటికీ కావాస్లింది