27, మే 2010, గురువారం

నిరీక్షణ
ప్రియతమా
ఆశలదారాల్ని పట్టుకుని
గాల్లో ఎంత సేపని ఎగరనూ
నీ కోసం నే కన్నకలలు
గాలి సౌధాలే
నా పట్ల నీ స్పందన నిర్లిప్తతే
నాలో నేను జీవం పోసుకుని
ఎంత కాలమని
జీవించగలను
కలకంటి కంట నీరు
కొనగోటితో తుడుస్తావనే
ఆశ లేనే లేదు
నన్ను నేను ఓదార్చుకుని
ఎంత కాలం నచ్చ చెప్పుకోనూ
ఒక్క నాడయినా
నీ నుండి ఆప్యాయపు ఉంటుందనే
ఆశ లేనే లేదు
బ్రతుకుకు ఆశేలేనపుడు అది జీవితమే కాదు
అది జీవచ్సవపు
హృదయ ఘోష

24, మే 2010, సోమవారం

నాన్న
నాన్నా i
నీ మమకారాన్ని
అనంతమయిన నీ ప్రేమని
ఎన్ని జన్మలెత్తినా ఎలా మార్చి పోగలను
కాళ్ళ ముందు జాగ్రదావస్థలో
నీవుంటే
గుండెని గట్టిగా పిండేసిన బాధ
ఒక్కసారి
ఒకే ఒక్కసారి
కళ్ళు తెరిచి
మమ్మల్ని చూడు నాన్నా
మనస్సంతా వేదనతో
సుళ్ళు తిరిగినా
సుదూర తీరాలకు వెళ్లిపోయిన
నాన్న తిరిగి వస్తారా???/??
పెరుగు .సుజనారామం

17, మే 2010, సోమవారం

nee sneham

ఎన్ని యుగాల నిరీక్షణ ఫలితమో కదా
నిర్మలమయిన నీ స్నేహం
నా కలలన్నీ నీ ఆలోచనల ప్రాకారాలయ్యాయి
నేను నేను కాదు
నువ్వు నువ్వు కాదు
మనం మాత్రమే
ఒకే ఆలోచన
ఒకే ఊహ
ఒకే ప్రపంచం

5, మే 2010, బుధవారం

వీడని నీడ

ఈ అనంత రాగాల్లోంచి
నీ విస్వప్రేమల్లోంచి
నన్ను నేను కోల్పోవాలని ప్రతిసారీ
అనుకుంటూనే ఉన్నా
కానీ నేస్తం ...!
ఒక్కో గాయం
మనస్సుని స్పృజించి
మమతని మొలిపించి
తొలకరిని కురిపిస్తూనే ఉంటుంది
ఆకాశమార్గంలో నీలిమేఘాలతో
దోబూచులాడుతూ నువ్వూ....!
చిగురుటాకు కలవరంతో
వణుకుతూ నేను
ఈ తనువీడే వరకూ
నా నుండి నీ మనస్సుని కోల్పోలేనేమో
నీజ్ఞాపకాలు
వీడని నీడలై
నన్ను వెంటాడుతూనే ఉంటాయి