25, జులై 2010, ఆదివారం

నా అన్వేషణ

అనాది కాలం నుండీ నేటి వరకూ ఈ సమాజాభివృద్ధి బాధ్యత పురుషుడిదే ,స్త్రీ లేనట్లే చూస్తోంది పితృస్వామ్య సమాజం.స్త్రీలు శారీరకంగా పురుషునికన్నా కొంచెం
బలం తక్కువ వారనే భావనతో ప్రారంభమయిన ఆధిక్యత క్రమంగా బలపడి పురుషాధిక్య ప్రపంచానికి నాంది ఏర్పడింది
ఆదిమ సమాజంలో ఆహారం కోసం స్త్రీ పురుషులు ఇరువురూ శ్రమించే వారు
వేటలోనూ,యుద్ధంలోనూ ఇరువురూ ప్రధాన పాత్ర వహించినా ,సంతానాన్ని కాపాడవలసిన ప్రత్యేక బాధ్యత స్త్రీలకే ఉండేది. వ్యవసాయం, గృహనిర్మాణం ,బుట్టలు, కుండలు ,దుస్తులు,వైద్యం చేయడంలోనూ వ్యాపారం చేయడంలోనూ స్త్రీలు అత్యంత సమర్థత చూపేవారు.సామాజిక అవసరాలన్నీ దాదాపుగా స్త్రీల వలన తీరుతుండేవి.మాతృ స్యామ్య వ్యవస్థలో స్త్రీ నిర్వహించిన పాత్ర ,ప్రాధాన్యత మిక్కిలి ప్రశంసనీయయమయినవి.
వ్యవసాయం చేయటానికి నాగలిని సాధనంగా చేపట్టి పశుసంపదపై హక్కును మొదటిసారిగా చేపట్టక పురుషుడు ,తల్లి హక్కులన్నీ రద్దు చేసి సమాజంలోనూ ,కుటుంబంలోనూ తన పెత్తనాన్ని చెలాయించటం మొదలు పెట్టాడు .క్రమంగా పురుషుని కోర్కెలు తీర్చే బానిసగా,పిల్లల్ని కనే యంత్రంగా స్త్రీ మార్చబడింది.
విద్యా దేవతను స్త్రీ దేవతగా భావించి పూజించినా ,స్త్రీలకు మాత్రం విద్య లేకుండా చేసారు.స్త్రీ విద్య,శూద్ర విద్యనూ నిషేదించారు.
స్త్రీలు ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలో స్మృతి కర్తలు మొదలుకొని శతక కారులు వరకూ బోధించారు.స్త్రీ పురుషునికి మాత్రమే పరిమితమై సేవచేసుకునే ఒక వస్తువుగా పరిగణించబడింది.
కార్యేషు దాసీ కరణేషు మంత్రి
రూపేచ లక్ష్మి శయనేషు రంభా
భోజ్యషు మాతా క్షమయా ధరిత్రి
శాత్కార్మయుక్తాం కుల ధర్మపత్ని అంటూ ఆనాటి నుండి నేటి వరకూ స్త్రీల గమనాన్ని
నిర్దేశిస్తూ ఇలా ఉతంకిస్తూనే ఉన్నారు.
వివాహం పురుషులకు ఒక చక్కని నమ్మకమయిన పని మనిషిని చేకూర్చాయి.మాతృ స్వామ్య వ్యవస్థలో ఏక భార్య,ఏక భర్త పద్దతిని అవలంభించినా ఎక్కడా వ్యభిచారం వృత్తిగా గల స్త్రీలు
ఎక్కడా కనిపించరు .శతాబ్దాలు తరబడి ఎన్నో రకాలుగా పీడింప బడుతున్న స్త్రీల ఉనికి కి సంఘ సంస్కర్తలు ,ఉద్యమాలు సాహిత్యం ఊపిరి పోశారు సతీ సహగమనా నిషేధం,బాల్య వివాహాల రద్దు,.అంతే కాకుండా స్త్రీ విద్య కోసం పెద్ద పోరాటమే జరిగింది
ఎన్ని చట్టాలు వచ్చినా ఎంత ప్రగతిని సాధించినా వివక్ష కొనసాగుతూనే ఉంది .స్త్రీని రెండో రకం మనిషిగానే చూడటం జరుగుతోంది .ఇంటా,బయటా ఎటు చూసినా
సమస్యలే
ఈ సమస్యల పరిష్కారమే నా అన్వేషణ
పెరుగు .సుజనారామం