By Perugu Sujanaram · 23 డిసెంబర్ 2011
చాన్నాళ్ళుగా ....
నాలో గాఢమైన కోరిక
మీకో ఉత్తరం రాయాలనీ,
నా సంఘర్షనంతా చెప్పాలనీ
అమ్మా అని నోరారా పిలవాలనే నా ఆశ
ఇస్త్రీ మడతలు నలగని చీరలతో
మహిళా మండలి ప్రసంగాలతో
సీరియస్ గా ఉన్న
నిన్ను చూసి నీరుగారి పోయేది.
నాన్నా అని ఆర్తిగా
అనాలనే నా ఆత్రుత
రూపాయల్ని డాలర్లు లో మార్చటం తప్ప
కన్న బిడ్డని దగ్గరకు తీసుకోలేని
నీ కాటిన్యపు క్రమశిక్షణ
కంటంలోనే నొక్కేసింది.
అ...