ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం
ఇంద్ర ధనుస్సులా...
గొడుగులాంటి నాన్న కాస్తా..
ఎటిఎం గా మారిపోయాక..
సాఫ్ట్వేర్ జంటలు
న్యూ క్లియర్ కుటుంబాలయ్యాక
జీవితం అవిశ్రాంతమై
అప్పుడప్పుడు వినిపించే
బిగ్ ఎఫ్ ఎం రైన్ బో గా మారింది..
అమ్మ అనకాపల్లెలో
నాన్న బెంగులురులో
నేను అమెరికా లో
మమ్మల్ని కామన్ గా కలిపేది
సెల్ ఫోన్..
నెట్ చాట్...
మా జీవన విలువలన్నీ
ఇప్పుడు తెరల మీదే ఆవిష్కరణ
మాకిప్పుడు తెర మరుగు జీవితం కరువు...
దేహం లోని అవయవాలు తస్కరిమ్పబడటం
గర్భ సంచులు అద్దెకివ్వడం
సరికొత్త సంస్కృతి అయ్యాక...
పురిటిగడ్డ పేరే గుర్తు లేదు..
డాలర్ ను కవ్గిలించుకున్నాక
ఇంటి పేరు ఇట్టే వదిలేసా
ఛీ..ఇండియాన్స్ అంటూ ఎవగిస్తున్న..
రక్తం ధారపోసిన చరిత్ర పాఠాల్ని వెక్కిరిస్తున్నా.
పెరుగు.సుజనారామం
kavitha baagundi
రిప్లయితొలగించండిమీ ఆవేదన సమంజసమే. మారే కాలంతో పాటు మనమూ మారాలేమో. బ్లాగ్ లోకానికి స్వాగతం.
రిప్లయితొలగించండి