2, నవంబర్ 2010, మంగళవారం

మాటల ప్రవాహం
ఇదేమిటి ఇలా
మాటలు ప్రవహిస్తున్నాయి
దూరతీరలన్నిటినీ ఏకం చేసి
జన్మాంతరాల బంధాన్ని ముడివేసి
నీకు నేనున్నానంటూ
నీకోసమే నేనంటూ
సరికొత్త లోకపు ద్వారం తెరిచిన
నా ప్రాణ నేస్తమా
ఎన్ని వేదనలైనా
ఎన్నెన్నిసంఘర్షణలు అయినా
నీ మాటల ప్రవాహలో
మబ్బులా తేలి పోతున్నాయి

పెరుగు .సుజనారామం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి