2, నవంబర్ 2010, మంగళవారం

ఇదేం న్యాయం నేస్తం
హృదయ నేస్తమా
కరిగిపోయిన కమ్మని కలని
జ్ఞాపకం చేస్తావెందుకు?
నీ గూర్చి నేను కన్న స్వప్నాలన్నీ
చెల్లా చెదురు చేసింది నీవే కదా!
నీకోసం యుగాలు నిరీక్షించాలనుకున్నా
నీ కోసం సమస్త ప్రపంచాన్నీ
ఎదిరించాలనుకున్నా
నేనంటే నేను కాదు
నేనంటే నీవే అనుకున్నా
కానీ నువ్వు
నన్ను అగాధంలోకి నేట్టేసావు
శిధిలమయిన
నా హృదయపు ప్రతిబింబపు
ప్రతి ముక్కలోనూ
నీకోసం వెతికి వెతికి
అలసిపోయాను
కనిపించలేదు శిశిరంలోని రాలిన ఆకులా
హిమ శిఖరం నుండి జారిన తుషారంలా
పిచ్చి దానిలా వైతరినిలో మునిగి పోయాను
మళ్ళీ ఇప్పుడు ,ఇన్నాళ్ళకు
నా కళ్ళముందు
చెదిరిన స్వప్నాల మూటని
విప్పమంటావు
ఒక్కో ఆత్మీయపు పలుకరిమ్పుని
జోడిస్తావు
జ్ఞాపకాల గాయాల మురళిని
గేయంగా మారుస్తానంటావు
కమ్మని ని పాటకి పల్లవి కమ్మంటావు
ఇదేం
న్యాయం నేస్తం ?????
పెరుగు.సుజనారామం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి