11, జనవరి 2011, మంగళవారం


సాగర సంగమం
ఒకానొక ఉక్రోషం
నా మనస్సులో ఉవ్వెత్తున ఎగురుతోంది.
అది కోపమో,ఆవేశమో
అయోమయమో నాకే అర్థం కాని వేదన
నాదే,నాకే సొంతమయిన
వస్తువునెవరో బలవంతంగా
తీసుకెలుతున్న భావన
కోపం అంచులు దాటుతున్నట్లుంది.
గుండె తడి కూడా ఆవిరయింది
నిజం నేస్తం
యుగాల నాటి మన స్నేహం
కారణాన్తరాల మధ్య
కాలగమనం చెందింది.
నీకోసం వేచిన కళ్ళు
కన్నీటి చుక్కలుగా మారి
ప్రవాహాలై
సాగర సంగమం చెందాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి