23, ఏప్రిల్ 2010, శుక్రవారం

అత్తయ్య చిరునవ్వు

కొంగు చెంగు ముడివేసుకుని
మగని చిటికెన వేలు పట్టుకుని వచ్చిన
నన్నెంతో ఆప్యంగా ఆహ్వానించిన అత్త
వేల వేల విషాదాల సుడిగున్దాల్ని
తన మది సంద్రంలో దాచేసుకుంది
ఆమె నుదుట పడిన మడతల మాటున
ఒదిగిన సంఘర్షనాచిహ్నాలెన్నో
అందం తెలివి అణకువ అన్నీ
సొంతమైన మీరెందుకు ...
మావయ్య ను ఎదిరించాలేదంటే .....?
జవాబుగా మెరిసి కనుమరుగయ్యేది చిరునవ్వే
దశాబ్దం గడిచిన నా దాంపత్యంలో జీవితంలో
చరిత్ర పునరావ్రుతమే అయింది
గుక్కెడు మంచినీళ్ళయినా పోయని
సవతి సాడిమ్పులకన్నా
వంగాదీసి నడ్డి మీద మగడు
గుద్దే పిడిగుద్దుల కన్నా
దేగాల్లా వెంటాడే పోకిరి కుర్రాళ్ళ
వెకిలి చూపులకన్నా
అమ్మా ఆకలే అంటున్న చంటాడు
మరో రెండేళ్లకే పయిట పరికిణి
వేసుకోబోతున్న పాప
కనుల ముందుంటే ...
నా తెలివి ,నా చదువు ,అందమూ
చేతకాని తనంలా
ఒంటింటి కుందేలుగా మారినప్పుడు
అర్థమైంది నాకు
అతయ్య చిరునవ్వు కు అర్థం
- Show quoted text -
పెళ్లయినపిల్ల
ఈ పిల్లకు పెళ్లయింది
కన్నవారి కనుల పంటగా
అయిన వారి ఆశల విందుగా
అత్తగారి కాసుల పంటగా
మనువాడిన మగనికి దొరికిన
సరికొత్త బానిసగా .....
పెళ్ళయిన పిల్ల.....
అంత చదువు చదివుండి
పనిపిల్లగా ముసుగు కప్పుకుంది
ముసుగు భరిస్తుంది కదాని
కఫన్ కప్పే ప్రయత్నం మాత్రం చేయకు ....

పెరుగు.సుజనారామం

ఆకాశంలో సగం..

పంచి ఇవ్వడమే
పరమావధిగా జీవించేది ఆమే..
ఎంగిలిచేసి ,రుచి చూసి
రాముడి ఆకలి తీర్చిన శబరి
భిక్షాటన చేసి
బిడ్డల ఆకలి తీర్చిన కుంతి
అప్పటికీ
ఇప్పటికీ
కాలమేదైనా
ప్రేమేనుపంచే అమృత ధార ఆమే
కడుపు తీపి కోసం
కన్నవారికోసం
బంధాల కోసం బందీ అయి
చివరి పంక్తిలో
ఆఖరి విస్తరిగా మిగిలే సహన రూపం ఆమే
మానాన్ని గాయాల చెట్టు చేసినా
దేహాన్ని తాకట్టు పెట్టినా
గర్భ సంచీ అద్దెకిచ్చినా
ఎక్కడో..
ఎవర్నో..
వుద్దరించేందుకు త్యాగ ఫలమయ్యేది ఆమే
పగలు నిప్పులు కక్కే సూర్యుణ్ణి
రాత్రి వెన్నెల చిందే చంద్రుణ్ణి
సమంగా భరించే ఆకాశంలో సగం ఆమే
సాధికారత వున్నా ,లేకున్నా
కొత్త చట్టా లిచ్చే శాతం ఎంతైనా
నూటికి నూరు శాతం
పంచి ఇవ్వడమే
పరమావధిగా జీవించేది మాత్రం ఆమే..!


పెరుగు.సుజనారామం
నెల్లూరు


ఒంటరి ప్రయాణం
ప్రపంచమంతా ఏకమై పోరాడినా
నిజం నిజమేగా
నాకేది రక్తస్పర్స
నేనెప్పటికీ ఒంటరినే
బ్రతుకు చివరంటా అన్వేషనే
ఐతేనేం .....
నాకో అస్తిత్వం వుంది
నన్ను నేను నిల్పుకోగల మానవత్వం వుంది
నా ఎగిరే
రంగుల సీతాకోక చిలుకలున్నై
నా పై వాలే భ్రమరాలున్నై
నా వైపు ప్రేమగా చూసే కాలభైరవున్నై
నా వెంటే తిరిగే నా చిన్నారు ఉన్నారు
ఎవరూ నా వెంట రాకున్నా
ఏడు వర్ణాల ఇంద్రధనస్సు వస్తుంది
నన్ను ఆర్తిగా స్పర్శించే చల్లని చిరుగాలి
నన్ను చూసి తలలూపే
చిన్ని మొక్కలు
ఇవే కదా
ఇప్పటి నా హ్రుదయాన్తర్భాగాలు


పెరుగు.సుజనారామం

nestham

ఎన్ని యుగాల నిరీక్షణ ఫలితమో కదా
నిర్మలమయిన నీ స్నేహం
నా కలలన్నీ నీ ఆలోచనల ప్రాకారాలయ్యాయి
నేను నేను కాదు
నువ్వు నువ్వు కాదు
మనం మాత్రమే
ఒకే ఆలోచన
ఒకే ఊహ
ఒకే ప్రపంచం