కొంగు చెంగు ముడివేసుకుని
మగని చిటికెన వేలు పట్టుకుని వచ్చిన
నన్నెంతో ఆప్యంగా ఆహ్వానించిన అత్త
వేల వేల విషాదాల సుడిగున్దాల్ని
తన మది సంద్రంలో దాచేసుకుంది
ఆమె నుదుట పడిన మడతల మాటున
ఒదిగిన సంఘర్షనాచిహ్నాలెన్నో
అందం తెలివి అణకువ అన్నీ
సొంతమైన మీరెందుకు ...
మావయ్య ను ఎదిరించాలేదంటే .....?
జవాబుగా మెరిసి కనుమరుగయ్యేది చిరునవ్వే
దశాబ్దం గడిచిన నా దాంపత్యంలో జీవితంలో
చరిత్ర పునరావ్రుతమే అయింది
గుక్కెడు మంచినీళ్ళయినా పోయని
సవతి సాడిమ్పులకన్నా
వంగాదీసి నడ్డి మీద మగడు
గుద్దే పిడిగుద్దుల కన్నా
దేగాల్లా వెంటాడే పోకిరి కుర్రాళ్ళ
వెకిలి చూపులకన్నా
అమ్మా ఆకలే అంటున్న చంటాడు
మరో రెండేళ్లకే పయిట పరికిణి
వేసుకోబోతున్న పాప
కనుల ముందుంటే ...
నా తెలివి ,నా చదువు ,అందమూ
చేతకాని తనంలా
ఒంటింటి కుందేలుగా మారినప్పుడు
అర్థమైంది నాకు
అతయ్య చిరునవ్వు కు అర్థం
- Show quoted text -
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి